AG 302 జయహే, జయహే
Versi Version 1
జయహే, జయహే
జయహే, జయహే
జయ జయ దేవసుతా
జయ జయ విజయసుతా ||జయహే||
1
సిలువలో పాపికి విడుదల కలిగెను
విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవెను
జీవన మొదవెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదను
నీ విజయము పాడెదను
నా విజయము పాడెదను
2
మరణపు కోటలో మరణమె సమసెను
ధరణిలో జీవిత భయములు దీరెను
మరణములో సహ జయములు నావే
3
శోధనలో ప్రభు సన్నిధి దొరికెను
వేదనలే రణభూమిగ మారెను
శోధన బాధలు బలమును వీడెను
4
ప్రార్థన కాలము బహు ప్రియమాయెను
సార్థక మాయెను దేవుని వాక్యము
ప్రార్థనలే బలి పీఠములాయెను
5
స్వాంతములో నిజ శాంతి లభించెను
భ్రాంతులు వింతగ ప్రభుపర మాయెను
స్వాంతమె సిలువకు సాక్షిగ వెలసెను

OK