AG 31 నా నోటన్‌ క్రొత్త పాట
Versi Version 1
నా నోటన్‌ క్రొత్త పాట
నా యేసు యుంచెను
ఆనందించెదను - ఆయననే పాడెదన్‌
జీవిత కాలమంత - హల్లెలూయ
1
పాపపు బురద నుండి - లేవనెత్తెను
జీవ మార్గమున నన్ను - నిలువబెట్టెను
2
వ్యాధి బాధలందు నన్ను - ఆదుకొనెను
కష్టములన్ని తొలగించి- శుద్ధీకరించెను
3
తల్లిదండ్రి బంధుమిత్రు-దూరమాయెనే
నిందనుభరించి ఆయన
మహిమ చాటెదన్‌
4
ఇహలోక శ్రమలు - నన్నేమి చేయును
పరలోక జీవితమునే - వాంఛించెదను

OK