AG 311 రాకడ సమయంలో
Versi Version 1
రాకడ సమయంలో
కడబూర శబ్దముతో
యేసుని చేరుకొనే
విశ్వాసము నీకుందా
రావయ్యా యేసయ్యా
వేగమె రావయ్యా (2)
1
యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగే రక్షణ నీకుందా
లోకయాశలపై విజయం నీకుందా ||రావ||
2
ఇంపైన ధూప వేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా
యేసు ఆశించే దీన మనస్సుందా ||రావ||
3
దినమంతా దేవుని సన్నిధిలో
వాక్యము కొరకు ఆకలి నీకుందా
యేసు నాధునితో సహవాసం
నీకుందా ||రావ||
4
శ్రమలోన సహనం నీకుందా
స్తుతియించే నాలుక నీకుందా
ఆత్మల కొరకైనా
ఆవేదన నీకుందా ||రావ||
5
నీ పాప రోత జీవితము
నీ పాప హృదయం మారిందా
నూతన హృదయంతో
ఆరాధన నీకుందా ||రావ||
6
అన్నిటికన్నా మిన్నగను
కన్నీటి ప్రార్థన నీకుందా
ఎల్ల వేళల స్తుతియాగం
నీకుందా ||రావ||

OK