AG 312 రాజాధిరాజా రా...రా
Versi Version 1
రాజాధిరాజా రా...రా
రాజులకు రాజువై రా...రా
రాజా యేసు రాజ్యమేల రా...రా
రవికోటి తేజ యేసు రా...రా
ఓ మేఘవాహనంబు మీద వేగమే
ఓ మించు వైభవంబు తోడ వేగమే ||రా||
1
ఓ... భూజనంబులెల్ల తేరి చూడగా
ఓ... నీ జనంబు స్వాగతంబు నీయగా
నీ రాజ్య స్థాపనంబు సేయ
భూ రాజులెల్ల కూలిపోవ
భూమి యాకసంబు మారిపోవ
నీ మహా ప్రభావమున వేగ ||రా||
2
ఆ... ఆకసమున దూతలార్భటింపగా
ఆ... ఆది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన
ఏకమై మహా సభ జేయ
యేసు నాధ నీదు మహిమలోన
మా కదే మహానందమౌగ ||రా||
3
ఓ... పరమ యెరూషలేము పుణ్య సంఘమా
ఓ... గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమ దూతలారా భక్తులారా
పౌలపోస్తులారా పెద్దలారా
గొఱియపిల్ల యేసు రాజుపేర
క్రొత్త గీత మెత్తి పాడరారా ||రా||

OK