AG 313 మేఘాల మీద మన ప్రభు యేసు
Versi Version 1
మేఘాల మీద మన ప్రభు యేసు
మహికి ఏతెంచు వేళ ఆసన్నమాయె
భువికి ఏతెంచు వేళ
1
మెరుపు రథముల మీద
ఉరుము బాటలపైన
మన యేసుడరుదెంచగా
మరణ కోటలలోన
నిదురించు ప్రియులంత
మహిమకాయములొందుచు
మీది లోకాల మోదాంలోన
ప్రియ ప్రభుని దర్శింతుము ||మే||
2
మధ్యాకాశములోని
దూత పంక్తుల నడుమ
మరియ సుతుడగు పించగా
మరణమొందక మిగులు
రారాజు జనులంతా
కాంతి దేహములు దాల్చుచూ
మెరుపు దీపాలై-మహిమ రూపాలై
వరుని ముఖమును గాంతురు ||మే||
3
దేవా దేవుని మహిమ
దిశలెల్ల విరబూయ
దేవసుతుడరుదెంచెను
దయనొందు ప్రియులంతా
కొలువు దీర్చగ ప్రభువు
దానములు దయచేయును
ధవళ వస్త్రాలు-నీతి మకుటాలు
ముదమార ధరియింతుము ||మే||
4
కలకాలము పంట వరుడేసు
పరిణయము-కమనీయముగ సాగుచూ
కళ్యాణకాంతులతో
దేవాలోకపు కళతో
వధువు వదనము మెరియగ
కనకహారాలు పుణ్యవరాలు
అక్షింతలై కురియుచుండ ||మే||

OK