AG 315 పరిశుద్ధ జీవిత మరయుడి ధరనిక
Versi Version 1
పరిశుద్ధ జీవిత మరయుడి ధరనిక
ప్రభురాక చాల సమీపమాయె
తండ్రి వాగ్దానములు నెరవేరెనని
సిద్ధపడుద మహా
1
కరువులు యుద్ధము
కాటకములు - భూ-కంపములన్‌
హతులైరి జనుల్‌
విభుపాదముల్‌ సేవింప నెగయుటకై
సిద్ధపడుద మహా ||పరి||
2
రాజ గృహంబుల-పేదల యిండ్లను
ప్రజలకు స్వస్థత లేదు గదా
ప్రభు రాకడ కిదియును
సూచన యని
సిద్ధపడుద మహా ||పరి||
3
ఆకాశ శక్తులు-భీకరముగ దమ
మూకల బాసియు శాఖలాయె
యేసు రాకడ కిదియును
సూచన యని
సిద్ధపడుద మహా ||పరి||
4
జీవపు డాంభికులీ వసుధను దమ
జీవపు టాశలలోన బడె
దైవ జీవము బొందగ
నందరమును
సిద్ధపడుద మహా ||పరి||
5
సౌందర్య రాశియు
చక్కని రూపియు
సత్య దూతాళితో సరగ వచ్చున్‌
ప్రభు సారూప్య మొందియు
నెదురేగుటకు
సిద్ధపడుద మహా ||పరి||
6
పెండ్లి కుమారుడు
ప్రేమ స్వరూపుడు
విడిది గదిని-సిద్ధపరచె నహా
ప్రియ కడ జను పెండ్లి
కుమార్తెవలెన్‌
సిద్ధపడుద మహా ||పరి||

OK