AG 322 కానాన్‌ పురము కరుగుదము
Versi Version 1
కానాన్‌ పురము కరుగుదము
ఓ నా సోదరులారా
ఓ నా సోదరులారా
మానితంబౌ విందు నందు
మనము చేరుదము
1
ఆ మహిమ నగరమందు
ఆకలిదప్పులు లేవు
ఆకలిదప్పులు లేవు
క్షేమ మిచ్చు రాజ్యమందు
చేరుదము రారే ||కానాన్‌||
2
కన్నీరేమి కష్టంబేమి
కానారాదే యందు
కానరాదే యందు
యెన్నడైన చూడనట్టి
ఎన్నో వింతలుండు ||కానాన్‌||
3
రత్న వజ్ర గోమేధికము
రాజిల్లు తోరణముల్‌
రాజిల్లు తోరణముల్‌
ముత్యాల హారంబులను
ముచ్చటగ బొందుదము ||కానాన్‌||
4
సుప్రశస్తమైన విందు
చూడ బోదామందు
చూడ బోదామందు
ఆ ప్రియంబౌ దూత శ్రేణిన్‌
నానందంబు నొంద ||కానాన్‌||
5
పరమకానాన్‌ పురమునందు
పనులు మనువులులేవు
పనులు మనువులు లేవు
హల్లెలూయ పాటలతో
ఆనందంబు నొంద ||కానాన్‌||

OK