AG 324 ఎపుడు చేరెద తేజ గృహమే
Versi Version 1
ఎపుడు చేరెద తేజ గృహమే
ఎపుడు చేరెద నా నివాసం
ఎపుడు చేరెదను
1
దేవుడే నాకై యుంచిన వాసస్థలమే
చేరెద సంతోషమంద
యేసురాజు నా కొరకై
సిలువనే చేర ||ఎపుడు||
2
ఆశతీర యేసు సముఖం
మధుర గానమే
నిత్యమే యేసుని నామం ప్రేమించియే
నేను పాడ ఆశతీరునే ||ఎపుడు||
3
చెల్లించెదనే స్తోత్ర బలియే ఎల్లవేళలను
అర్పింతు స్తుతి ఘనమహిమ
పేదనైన స్తోత్రము చేయ
దేవుడనుగ్రహించె ||ఎపుడు||
4
దైవకృపయే కరుణ యిదియే
నేను చాటింప
గీతముల్‌ దిన దినం మ్రోగ
నిత్య కాలం ప్రేమహారం
యేసుకే చెల్లున్‌ ||ఎపుడు||
5
ధ్యానించగ నా హృదయ పూర్వక
కృతజ్ఞతాస్తుతులే
జ్ఞప్తియే యేసుని నగరం
ప్రేమించియే నేను పాడ
ఆశ తీరునే ||ఎపుడు||

Share

OK