AG 327 మన బలమైన దేవాది దేవుని
Versi Version 1
మన బలమైన దేవాది దేవుని
రాజ్యము సమీపమౌచున్నది
తన కృపకాలము అతి త్వరితముగా
నిల గతింపనై యున్నది
1
ఆకలిదప్పులుండవచట
వ్యాధి బాధలు లేవచట
విలాపములకు రోదన ధ్వనులకును
తావులేదచట
2
సంతోష సునాదములు
నీతి సమాధానములు
ఆ రాజ్యమునకు ఆధారములై
అవి నిలుచు కలకాలం
3
అక్షయ రాజ్యమునీయా
రక్షకుడే నిను పిలువా
తక్షణమాయన సైన్యములో
చేరి సాగిపోయెదవా

OK