AG 37 1 ఉన్నత దేవుని - చాటున
Versi Version 1
1
ఉన్నత దేవుని - చాటున
నివసించువాడే
సర్వశక్తుని నీడను - విశ్రమించున్‌
ఆహా! పరమ ధన్యత యిదియే! (2)
తన రెక్కల క్రింద ఆశ్రయము
తన రెక్కలతో కప్పును (2)
2
దేవుడే నా ఆశ్రయం
నా కోటయు దుర్గమును
ఆయనే సత్యము - నా కేడెమును
నే నమ్ముకొను దేవుడు (2) ||తన||
3
రాత్రిలో భయముకైన
పగటి బాణముకైన
చీకటిలో తిరుగు తెగులుకైనను
భయపడనే భయపడను(2) ||తన||
4
వందలు వేలైన
నీ ప్రక్కను కూలినను
ఆయనే నీదు విమోచకుడు
అపాయము తాకదు (2) ||తన||
5
దేవుడే నీ ఆశ్రయం
ఆయనే నీ నివాస స్థలం
అపాయము తెగులు గుడారమును
చెంతకు సమీపించవు (2) ||తన||
6
నీ...దు మార్గము లన్నిటన్‌
తన దూతలు కాపాడున్‌
పాదమునకు రాయి తగులకుండా
వారు నిన్నెత్తికొందురు (2) ||తన||
7
కొదమ సింహము నణచి
నాగు పాములన్‌ త్రొ....క్కి
అతడు నన్ను ప్రేమించెను
అతనికి జయమిత్తున్‌ (2) ||తన||
8
నా...నామము నెరిగెన్‌
అతని ఘనపరచెదను
శ్రమలో నేనతనికి తోడైయుండి
నే నుత్తర మిచ్చెదను (2) ||తన||

OK