AG 45 ఉన్నత దేవుడు నీతో నుండగ
Versi Version 1
ఉన్నత దేవుడు నీతో నుండగ
దిగులెందుకే మనసా!
ఎంతో మంచివాడు శక్తి సంపన్నుడు
మేళ్లకు కొదువలేదే ||ఉన్నత||
1
పాపిగానున్న నిన్ను
పరిశుద్ధ పరచెనుగా
లేమిలోనున్న నిన్ను
తన దయతో లేపెనుగా ||ఉన్నత||
2
ఆనాడు మొఱ్ఱపెట్టిన
ఆ హన్నా ప్రార్థన వినెను
అనాధగానుండిన
ఆ హాగరు నోదార్చెను ||ఉన్నత||
3
యేసు నీ ముందు నడిస్తే
ఆ యోర్దానున్‌ దాటగలవు
విశ్వాసం నీకుంటే
ఆ యెరికోనే కూల్చగలవు ||ఉన్నత||

OK