AG 64 ఆశీర్వదించు - మా తండ్రీ
Versi Version 1
ఆశీర్వదించు - మా తండ్రీ
ఆ-నందం - పొంగను
నీ ముఖకాంతి వీరిపై ప్రకాశింప నీ!
దేవా! పంపు నీ యాశీర్వాదము
నీ దీవెన నిత్యముండును
తరతరముల వరకు పొర్లి - పారును
1
దంపతులతో నీవుండి
ని...త్యం నడిపించు
నిన్నే వెంబడించునట్లు దారి చూపుమా
ఇహమే మోక్షముగ చేయు దేవా
ప్రేమయు విశ్వాసములతో నీలో
వసించి తరించ కృపనీయుమా!
2
ఐక్యపర్చుము వీరిని నీదు చిత్తములో
జ్ఞానులై దీనులై నిన్ను ధరన్‌ సేవింప
జయశాలులుగాను జీవింపను
పాలించు వీరి హృదయముల్‌
నీ మహిమను చాటింప
దేవా! దీవించుమా

OK