AG 66 బెత్లెహేములో పుట్టెనేసు
Versi Version 1
బెత్లెహేములో పుట్టెనేసు
స్తుతియించుము మనసా - నేడే (2)
1
సర్వమును సృష్టించిన - సృష్టికర్తయే
తానే తాలిమితో తల్లి ఒడిలో
తలనాన్చెను ||బెత్లె||
2
సింహాసనా సీనుడైన దేవపుత్రుడే తానే
పసివానిగ పశుల తొట్టిలో
పవళించెను ||బెత్లె||
3
లేఖనములు చెప్పినట్లు- నెరవేర్చుటకై
తానే మోక్షం వీడి దీనునిగా
దిగివచ్చెను ||బెత్లె||
4
పరలోక దూతలతో - పరవశించెను
తానే మన కొరకే పశుల పాకలో
జనియించెను ||బెత్లె||
5
ఇంత గొప్ప ప్రేమ చూపినా యేసుని
మనం సంతసముగ కలసి వెళ్లి
స్తుతియించెదం ||బెత్లె||

OK