AG 70 ఏ పాప మెరుగని - యో పావన
Versi Version 1
ఏ పాప మెరుగని - యో పావన
మూర్తి పాప - విమోచకుండ
నా పాలి దైవమా - నా పాపముల
కొర-కీ పాట్లు నొందినావా
1
ముళ్ళతో ఁ గిరీట - మల్లి నీ
శిరముపైఁ జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ
సొమ్మ సిల్లిపోతివి రక్షకా ||ఏ||
2
కలువరి గిరి దనుక - సిలువ
మోయలేక - కలవరము నొందినావా
సిలువ నీతో మోయ - దులువలు
వేరొకని దోడుగా నిచ్చినారా ||ఏ||
3
చెడుగు యూదులు బెట్టు
పడరాని పాట్లకు - సుడివడి నడచినావా
కడకు కల్వరిగిరి - కడకేగి సిల్వను
గ్రక్కున దించినావా ||ఏ||
4
ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను
నా కొయ్యపై నుంచిరా - నీ కాలు
సేతుల నా కొయ్యకే సూది
మేకులతో గ్రుచ్చినారా ||ఏ||
5
పలువిధంబుల శ్రమలు-చెలరేగఁ
దండ్రికి-నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై బలుమారు - కలుగుచుండెడి
బాధ - వలన దాహము నాయెనా ||ఏ||
6
బల్లిదుండగు బంటు బల్లెమున నీ
ప్రక్క - జిల్లిబడ బొడిచినాడా
ఉల్లోలముల వలె - నల్ల నీ
రుబుకంగ - జల్లారె గద కోపము ||ఏ||
7
కటకటా పాప సంకటముఁబాపుట
కింత - పటు బాధ నొందినావా
ఎటువంటి దీ ప్రేమ
యెటువంటి దీశాంత
మెటుల వర్ణింతు స్వామి ||ఏ||

Share

OK