AG 77 అపరాధిని యేసయ్యా
Versi Version 1
అపరాధిని యేసయ్యా
కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క ృపలో
నపరాధములను క్షమించు
1
సిలువకు నిను నే గొట్టితిని
తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా ||అప||
2
ప్రక్కలో బళ్ళెపు పోటు
గ్రక్కున బొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితివయ్యా ||అప||
3
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి ||అప||
4
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని
దేహంబు గాయంబులను ||అప||
5
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా ||అప||
6
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
నిందలు పెట్టితినయ్యో
సందేహ మేలనయ్యా ||అప||
7
రక్షణ దెచ్చితివయ్యా
శిక్షకు పాత్రుడనయ్యా
అక్షయ భాగ్యమునియ్య
మోక్షంబు జూపితివయ్యా ||అప||

OK