AG 83 బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా
Versi Version 1
బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా
మా యేసు మహా రాజు-వచ్చుచుండెను
1
ఆ దినం మిక్కిలి సమీపం
శుద్ధులుఅందరు చేరెదరు (2)
దేవుని బూర ధ్వనియించగా
దేవాది దేవుని సంధించెదము(2) ||బూర||
2
ఆకాశం భూమియు మారినను
శక్తిమంతుని వాగ్దానం మారదు
దేవుని బూర ధ్వనియించగా
దేవాది దేవుని దర్శించెదము ||బూర||
3
దొంగలు అటు యిటు తిరుగుచును
దేవుని వాక్యాన్ని మార్చుచున్నారు
ఓ దేవారమ్ము వాంఛను తీర్చుము
మెలకువతో వేచియున్నాము ||బూర||
4
కనురెప్పపాటున మారెదము
మోక్షంలో అందరము చేరెదము
కన్నీరుదిగులు అచ్చటలేవు
దేవుడు తానే వెలుగై యుండును ||బూర||

OK