AG 9 తేనియ కంటెను-యేసుని నామం
Versi Version 1
తేనియ కంటెను-యేసుని నామం
దివ్య మధుర - మౌను
నీవు పరుగిడి రమ్ము-దివ్య సన్నిధికి
దినము - ఓ మనసా!
1
లోకములోన - కష్టములెల్ల
యేసుడు - భరియించెన్‌
పాపకీడును బాపెన్‌ - శాపము మాపెన్‌
తెలిసికో ఓ మనసా! ||తేనియ||
2
పాపిన్‌ రక్షింప - ప్రాణము నిచ్చెన్‌
యేక కుమారుండు
ఇది యెంతటి కరుణ
నిరంతర ముండున్‌
స్తుతించుము ఓ మనసా! ||తేనియ||
3
అరుణోదయమున - మంచువలె నీ
లోకము మాయమగున్‌
నీవు యేసుని నామం నిరతము నమ్ము
హత్తుకో ఓ మనసా! ||తేనియ||
4
కష్టములోన – సంతోషమిచ్చు
మిత్రుడు ఆ ప్రభువే
తన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చున్‌
నిశ్చయం ఓ మనసా! ||తేనియ||
5
భూలోక వాసుల్‌ - పరలోక వాసుల్‌
ప్రభువుని - స్తుతియించుడి
యేసు నెరిగిన వారే పరమున చేర
తగుదురు ఓ మనసా! ||తేనియ||

OK