AG 92 మందలో చేరని గొఱ్ఱెలెన్నో
Versi Version 1
మందలో చేరని గొఱ్ఱెలెన్నో
కోట్ల కొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో
వెదకెదము రమ్ము ఓ సంఘమా
రమ్మనె యేసు
రాజును చేరా-నడిపించు
1
అడవులలో పలు స్థలములలో
నా ప్రజలెందుకు చావవలెన్‌
వారి నిమిత్తమై శ్రమపడితిన్‌
మరి వారిని వెదకెడి వారెవరు
రమ్మనె యేసు
రాజును చేరా-నడిపించున్‌ ||మంద||
2
ప్రకటించని స్థలములు కలవు
చాటించు వారు కలరిచ్చట
పిలువబడిన వారందరును
మన ప్రభువాజ్ఞకు లోబడుడి
రమ్మనె యేసు
రాజును చేరా-నడిపించున్‌ ||మంద||
3
నాకై పలికెడు నాలుకలు
నా వలె నడిచెడి పాదములు
నన్ను ప్రేమించెడి హృదయములు
కావలె నాకవి నీవిచ్చెదవా
రమ్మనె యేసు
రాజును చేరా-నడిపించున్‌ ||మంద||

OK