AG 97 స్తోత్రము రాజా ఆ...ఆ... స్తోత్రము రాజా
Versi Version 1
స్తోత్రము రాజా ఆ...ఆ... స్తోత్రము రాజా
స్తోత్రము రాజాధి రాజా...
1
స్తోత్రపాత్రుడ పూజ్యనీయుడా
నిత్యము నాశ్రితుల పాలుడ
సత్యుడా పరలోక వాసుడ
నిత్యుడా శ్రీ యేసు నాథుడా ||స్తోత్ర||
2
ఆకసము నీ మహిమను యిహ
లోకమందలి సర్వమును
యేకముగ స్తుతియించుచుండ
నీ కర్పించెద జిహ్వఫలము ||స్తోత్ర||
3
యిడుములు కడుసుడుల కైవడి
వడివడిగను పెనుగొనంగ
విడువను నెడబాయనంచు
విజయమిచ్చిన యేసునాథుడా||స్తోత్ర||
4
మరణచ్ఛాయ లోయలోబడి
తెరవు గానక నరుగువేళ
పరమ కనికర కరముచే నను
సరిగ నడిపిన మాదు ప్రభువా ||స్తోత్ర||
5
అరయ నాలో నీదు రూపము
సరిగ నేర్పడు వరకు నన్ను
తరచు శ్రమల యనుభవంబున
పొరల జేసిన యేసునాథుడా ||స్తోత్ర||

OK