AG 98 స్తుతి గీతముల నిలపాడరె
Versi Version 1
స్తుతి గీతముల నిలపాడరె
స్తోత్రార్హ ప్రభువునకు
మితిలేని ప్రేమచే - పాపుల వెదకియు
రక్షింపను వచ్చెన్‌
1
పరమందు దూతలు
పరిశుద్ధులు - ప్రభు సన్నిధినిన్‌ జేరి
నిరతంబు యిహమున
జరిగిన యీ ఘన - కార్యము
దలచెదరు ||స్తుతి||
2
హల్లెలూయ యనుచును బాడరే
ఇమ్మానుయేలునకు
కలుషంబులను - బాపను మనకై
వెల - సెను కలువరి గిరిపై ||స్తుతి||
3
జయగీతముల నిల పాడరే
జయశీలు డేసునకు
జయశీలుడై లేచెను మృతిగెల్చియు
మూడవ దివసమున ||స్తుతి||
4
భూలోక సైన్య సమూహమా
ప్రకటింపు మీ ప్రభుని
ఏ లోకమందైనను శ్రీ యేసుడె
రక్షకుడె యనుచు ||స్తుతి||
5
పరిశుద్ధుడు సంపూర్ణుడు
పరిపూర్ణుడా ప్రభువే
నిరతంబు తను గొల్చెడి నరులకు
తన - పరిశుద్ధత నిచ్చున్‌ ||స్తుతి||
6
రా రండి రక్షణ నొంద పరుగిడి
రండి ప్రభు కడకున్‌
జేరండి యేసుని జేరిన త్రోయడు
చేరెడు వారలను ||స్తుతి||
7
ఘనతయు మహిమయు చెల్లును గాక
ఘనుడగు ప్రభువునకు
ఘన తండ్రి కొమర - పరిశుద్ధాత్ముల
త్రియేక దేవునకు ||స్తుతి||

OK